BIG BREAKING: తెలంగాణ సీఎం ఎంపికకు ముందు ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం ఎంపిక నేపథ్యంలో ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పయనం అయ్యారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని నియామకం చేస్తే.. తాము ఒప్పుకోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తేల్చి చెప్పారట.
ఈ తరుణంలోనే ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పయనం అయ్యారు. దీంతో ఇవాళ సాయంత్రం తెలంగాణ సీఎం ఎంపికపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారన్నారు డీకే శివకుమార్. ఆ మేరకు ఈ సమావేశంలో తీర్మానం చేశారని వివరించారు డీకే శివకుమార్. ఖర్గే నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఎమ్మెల్యేలు ఆ తీర్మానంలో పేర్కొన్నారన్నారు డీకే శివకుమార్.