10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఏపీ ప్రజలు – BJP

-

 

10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఏపి ప్రజలు కూరుకుపోయారని..ఆంధ్రప్రదేశ్ లో అప్పులు తప్ప అభివృద్ధి లేదని ఫైర్‌ అయ్యారు ఏపి బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ సొమ్మును తిరుపతి కార్పోరేషన్ కు బదలాయించడం సమంజసం కాదని.. రూ. 4,600 కోట్ల వార్షిక బడ్జెట్ లో 1 శాతం నిధులను, “పరిశుభ్రత” పేరుతో మరో రూ. 50 కోట్ల నిధులను తిరుపతి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారని విమర్శలు చేశారు.

bhanu-prakash-reddy

రూ. 100 కోట్లను అభివృద్ధి పేరుతో తిరుపతి కార్పోరేషన్ కు తరలించి, కమీషన్ల పేరుతో జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు ఏపి బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ ఛైర్మన్ తన రాజకీయ లబ్ది కోసం టీటీడీ నిధులను ఖర్చు పెడుతున్నారని..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడిని అక్కడి నుండి పోటీ చేయించే ఆలోచనలో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారన్నారు. తిరుమల-తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం, ఇది ప్రభుత్వానికి ఆదాయ వనరు భావించరాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి తెలిసే ఇదంతా జరుగుతుందా..!? అని నిలదీశారు ఏపి బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version