పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా అడగాలని మాజీ సీఎం జగన్ ఇంకా తన పార్టీ ఎంపీలకు చెప్పడం సరికాదు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. కానీ జగన్ దాన్ని ఇంకా పట్టుకుని వేలాడుతున్నారు అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ గురించి జగన్ ఎందుకు మాట్లాడలేదు. ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్డు అని పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు.
విశాఖ రాజధాని అంటూ జగన్ అక్కడ ప్యాలెస్ కట్టుకున్నారు. మాజీ సీఎం జగన్ తప్పుడు విధానాలు అవలంబిస్తున్నారు. టిడిపి ఎంపీలు ఏపీ అభివృద్ధి కోసం పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడాలని సీఎం చంద్రబాబు సూచించడం అభినందనీయం అని తెలిపారు. అలాగే మహారాష్ట్ర విజయంతో దేశంలో రాజకీయంగా పెరుమార్పులు రాబోతున్నాయి. బీజేపీ అతి విశ్వాసంతో వెళ్లకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించారు. రానున్న రాష్ట్రాల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సహా ఎవరితోనైనా ప్రచారం చేయిస్తారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏపీ అభివృద్ధికి దోహదం చేస్తాయి అని సోము వీర్రాజు తెలిపారు.