నాకు కూడా రెడ్ బుక్ ఉంది..అందులో 100 మంది ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల హెచ్చరికలు జారీ చేశారు. భూమా అఖిల ఇవాళ మీడియాతో మాట్లాడుతూ…
నాకు కూడా రెడ్ బుక్ ఉందని…ఎవరిని వదలనన్నారు. అంటే వారిని ఏదో నేను చంపేస్తానని కాదు ఖచ్చితమైన ఆధారాలతో వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు అఖిలప్రియ.
మాజీ ఎమ్మెల్యే గంగుల డిగ్రీ కాలేజీ తెచ్చానని చెప్పుకుంటున్నాడని… పేరుకే డిగ్రీ కాలేజ్ కానీ సరైన వసతులు కూడా లేవని పేర్కొన్నారు. కనీసం స్వీపర్లు కూడా లేక విద్యార్థులతో గదులు శుభ్రం చేపిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేంద్ర రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు.. అతను కేవలం దొంగ ఓటర్ మాత్రమేనని చెప్పారు. సస్పెండ్ అయిన ప్రిన్సిపాల్ ని తీసుకొచ్చి డిగ్రీ కాలేజీకి వేపించుకున్నారని… మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.