ఇవాళ మహారాష్ట్ర ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరు కానున్నారు. కాగా, ఆలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు రేమండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారు.
రేపు జమ్మూలో శ్రీవారి ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నెల 3 నుంచి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అధికారులు భక్తుల సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నం కాగా… ఇవాళ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. రేపటి నుంచి భక్తులకు దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 60 ఎకరాల భూమిని కేటాయించింది.