అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడం కోసం చంద్రబాబు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. అటు లోకేష్ సైతం పాదయాత్ర ద్వారా కష్టపడుతున్నారు. ఇలా ఇద్దరు పార్టీ కోసంకష్టపడుతున్నారు. కానీ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాలని బాబు చూస్తున్నారు.
కానీ ఆ పొత్తులే టిడిపికి నష్టం తెచ్చేలా ఉన్నాయి. మొదట టిడిపి, జనసేన పొత్తు ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై పెద్ద రచ్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సీట్లు త్యాగం చేయాల్సిన నేతలు ఎదురుతిరుగుతున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని అంటున్నారు. దీనికి టిడిపికి లేనిపోనీ తలనొప్పి ఎదురయ్యేలా ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పెద్దలని కలవడం టిడిపికే పెద్ద మైనస్ అయ్యేలా ఉంది. బిజేపితో మాత్రం ఎట్టి పరిస్తితుల్లో పొత్తు వద్దని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.
చంద్రబాబు మాత్రం పొత్తు దిశగానే ముందుకెళుతున్నారు. ఒకవేళ అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో తాము వైసీపీకి ఓటు వేసేస్తామని చెబుతున్నారు. దీంతో టిడిపికి పెద్ద రిస్క్ వచ్చేలా ఉంది. అటు వైపు ఏమో బిజేపి..జగన్‌కు బాగానే సహకారం అందిస్తున్నట్లు కనిపిస్తుంది.వరుసపెట్టి నిధులు కూడా విడుదల చేస్తుంది. ఇటు ఏమో బాబుతో చర్చలు చేస్తుంది.
అసలు బిజేపి గేమ్ ఏంటి అనేది అర్ధం కాకుండా ఉంది. బిజేపి ఏమైనా ప్లాన్ చేసి..టిడిపిని దెబ్బకొట్టాలని చూస్తుందా? అనే టాక్ కూడా వస్తుంది. పొత్తు పెట్టుకుని టిడిపిని దెబ్బతీసి పరోక్షంగా వైసీపీకి లాభం చేయాలని చూస్తుందని కొందరు తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. చూడాలి మరి చివరికి పొత్తుల వ్యవహారం టిడిపికి కలిసొస్తుందో..దెబ్బవేస్తుందో.