ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందే భారత్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్లి ఓ ఎద్దును ఢీ కొట్టింది వందే భారత్ ట్రైన్. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ నుంచి ఈ సికింద్రాబాద్ వైపు వెళ్తున్న వందే భారత్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది.

తాళ్ల పూస పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఎద్దును.. వేగంగా వచ్చి వందే భారత్ ట్రైన్ ఢీకొట్టడం జరిగింది. ఇక వందే భారత్ ట్రైన్ స్పీడ్ దాటికి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. అటు వందే భారత ట్రైన్ ఇంజన్ ముందు భాగం కాస్త దెబ్బతింది. ఈ సంఘటన జరిగిన తర్వాత కొద్దిసేపు వందే భారత్ ట్రైన్ అక్కడే నిలిచిపోయింది. ఆ తర్వాత ట్రైన్ ను అధికారులు పంపించేశారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.