ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్..60 శాతం హాజరు ఉండాల్సిందే !

ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. ఇంటర్మీడియట్ లో 60 శాతం అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న విద్యార్థులను పరీక్షకు అనుమతించేందుకు ఇంటర్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. బోర్డు నిబంధనల ప్రకారం 75% హాజరు తప్పనిసరి.

సరైన కారణాలతో ఏ విద్యార్థికైనా 60%-75% వరకు హాజరు ఉంటే ప్రతిపాదనలు పంపాలని ప్రిన్సిపాల్ లకు బోర్డు సూచించింది. విద్యార్థులు 10 రోజుల తక్కువ హాజరుకు రూ. 1000, 15 రోజుల వరకు రూ. 1500, 15 రోజులు మించితే రూ. 2 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏపీ ఇంటర్ ఎక్సామ్స్… అతి తర్వలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అధికారులు  కసరత్తు చేస్తున్నారు.