ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. జగనన్న విద్యా కానుకను స్టూడెంట్ కిట్ పేరుతో విద్యార్థులకు టీచర్లు అందించనున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పోషణ గోరుముద్ద పేరుతో అమలు చేస్తారు.

పాఠశాలలు నిన్నే రీ ఓపెన్ కావాల్సి ఉండగా చంద్రబాబు ప్రమాణస్వీకారం నేపథ్యంలో టీచర్ సంఘాల విజ్ఞప్తితో సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అటు నిన్నటి నుంచే తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు పునఃప్రారంభం అయ్యాయి. కానీ ఏపీలో మాత్రం వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి.