తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. దింతో తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 66, 256 మంది భక్తులు..నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండి ఆదాయం రూ. 3. 54 కోట్లుగా ఉంది. జులై 18న అక్టోబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇది ఇలా ఉండగా, అలిపిరి మార్గంలో ఏనుగుల బీభత్సం సృష్టించింది.
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళుతున్న వాహనదారులు ఆందోళన చెందారు. శుక్రవారం సాయంత్రం ఏడో మైలు ఏనుగు ఆర్చికి సమీపంలో రోడ్డుకు దగ్గరగా 6 ఏనుగులు వచ్చాయి. సమీపంలోని చెట్లను విరగొడుతుండడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. వాటిని చూసి వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా, అటవీశాఖ సిబ్బంది వచ్చి పెద్ద పెద్ద శబ్దాలు చేసి ఏనుగులను అడవిలోకి తరిమారు. అనంతరం రాకపోకలు పునరుద్ధరించారు.