తమిళనాడు రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ విషాదంలో ఏకంగా నలుగురు మృతిచెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం విరుద్ నగర్ లో ఉన్నటువంటి టపాసుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఏకంగా అందులో పని చేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు.

మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే… గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో మరింతమంది… మరణించే అవకాశాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అటు మృతదేహాలను పోస్టుమార్టం కోసం.. పోలీసులు తరలించారు. పేలుడు సంభవించగానే స్థానికులు ఫైర్ ఇంజన్లకు ఫోన్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన… ఫైర్ ఇంజన్ సిబ్బంది.. మంటలు ఆర్పే పనిలో ఉంది. ఇక ఈ ఫ్యాక్టరీలో కోట్లలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక… ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు సంఘటన జరిగిందా? లేదా…? ఇతర కారణాల వల్ల జరిగిందా అనే వివరాలను పరిశీలిస్తున్నారు.