ఏపీ హైకోర్టులో ఆర్జీవీకి భారీ ఊరట !

-

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన ఇప్పటికే హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. గతంలో సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై పెట్టిన పోస్టులపై ఆంధ్రప్రదేశ్ లో రామ్ గోపాల్ వర్మపై పలు కేసులు నమోదు అయ్యాయి.

ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కొన్ని రోజుల క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటి యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సుమారు 9 జిల్లాలలో వర్మపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో తనపై నమోదైన కేసులన్నీ క్వాష్ చేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగగా.. రామ్ గోపాల్ వర్మ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం వర్మకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే దర్యాప్తునకు సహకరించాలని వర్మకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version