Big shock for YCP in Nidadavolu 11 councilors resigned from the party: నిడదవోలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ పార్టీకి ఏకంగా 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. వివిధ కారణాలతో వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు 11 మంది కౌన్సిలర్లు. రాజీనామా చేసిన వారిలో ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. దీంతో… నిడదవోలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది.

ఇక వైసీపీ పార్టీకి ఏకంగా 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో… నిడదలవోలు మున్సిపాలిటీలో మైనారిటీలోకి వెళ్లింది వైసీపీ. సభలో వైసీపీ బలం 27 కాగా ఈ రాజీనామాలతో 16కు పడిపోయింది బలం. మరి ఈ వైసీపీ పార్టీకి రాజీ నామా చేసిన 11 మంది కౌన్సిలర్లు.. టీడీపీ పార్టీలో వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక వైసీపీ పార్టీ కి ఏకంగా 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం పై వైసీపీ నేతలు ఇంకా స్పందించలేదు.