హై కోర్టులో రఘురామకు చుక్కెదురు..మీది అర్థం లేని వ్యాజ్యం !

-

ఏపీ హై కోర్టు లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చుక్కెదురైంది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను మీరెలా శాసిస్తారంటూ రఘురామకృష్ణరాజును హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం రుణాలు ఎలా తీసుకోవాలో మీరు నిర్దేశిస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు అసలు మీరెవరంటూ రఘురామకృష్ణరాజును నిలదీసింది.ర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదు.

ఈ వ్యాజ్యంలో మేం ఉత్తర్వులు జారీ చేస్తాం. కావాలంటే మేం ఇచ్చే ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకెళ్లొచ్చని.. రఘురామకృష్ణరాజునుద్దేశించి ఏపీ హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాన్ని మేం ఎందుకు వివరణ అడగాలి? ఎలాంటి వివరణ అడిగేది లేదు. ప్రభుత్వం నుంచి అఫిడవిట్‌ కూడా కోరం. ఇదో నిరర్థక వ్యాజ్యం. ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని మండిపడింది. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవద్దంటారా? అంటూ రఘురామకృష్ణరాజును హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పేదలు, సామాన్యులకు రాజ్యాంగం అర్థం కాదని, వారికి కావాల్సింది సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం మాత్రమేనని ధర్మాసనం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version