లోన్‌ యాప్‌ బాధితురాలు ప్రత్యూష కేసులో బిగ్‌ ట్విస్ట్‌ !

-

లోన్‌ యాప్‌ బాధితురాలు ప్రత్యూష కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ కేసుపై మంగళగిరి డీఎస్పీ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ… చినకాకానిలో వివాహిత ప్రత్యూష ఆన్ లైన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకుందని.. లోన్ చెల్లించినా వేధింపులు కొనసాగాయని వివరించారు.

ప్రత్యూషను లోన్ ఇచ్చిన వారు ఫోన్ లో వేధించారని తల్లితండ్రులు ఫిర్యాదు చేశారని… వేధింపులు తీవ్రంగా ఉండడం, స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి బెదిరించడం జరుగుతుందని వెల్లడించింది.
లీగల్ గా రికవరీ చేస్తే ఇబ్బంది లేదని… డబ్బులు వసూలు కోసం అసభ్యంగా మాట్లాడడం, వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రత్యూషకు ఫోన్ చేసి వేధించివారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చిన్నమొత్తం లోన్ తీసుకుంటున్న పేదలను వేధిస్తున్నారని.. పోలీసుల దృష్టికి వచ్చిన ప్రతి ఘటనపై కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. 306, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని మంగళగిరి డీఎస్పీ రాంబాబు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version