ఏప్రిల్ నుంచి పల్లెబాట పెట్టబోతున్నట్లు పేర్కొన్నారు ఏపీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు. గ్రూప్-1, ఆపై స్థాయి అధికారులు ఏప్రిల్ నెల నుంచి గ్రామ పర్యటనలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. గ్రామాల్లో రెండు నుంచి మూడు రోజులు గడిపితే కొత్త విషయాలు తెలుస్తాయని.. పట్టణాల కన్నా గ్రామాలు మంచి స్థితిలో ఉన్నాయని, వాతావరణం, మౌలిక సదుపాయాలు కూడా మరింత మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.
అధికారులు కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి, ప్రధాన సమస్యలను పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కార్యదర్శుల సమావేశంలోలో ఫైళ్లు క్లియరెన్స్ పైన అధికారులకు మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. ఫైళ్లు భారీగా పేరుకు పోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసారు. జలవనరుల శాఖలో ఒక్కో ఫైల్ క్లియరెన్స్ కు 50 రోజుల సమయం పడుతుంది. హోమ్ శాఖలో కీలక ఫైళ్ళ క్లియరెన్స్ కు 47 రోజుల సమయం.. సీఎంఓ ఐటి శాఖలో శాసన సభ వ్యవహారాలకు సంబంధించి సగటున 30 రోజుల సమయం.. కార్మిక శాఖలో 28 రోజులు.. పాఠశాల, విద్య శాఖలో 26 రోజులు.. ఆర్ధిక, అటవీ శాఖలో 9 రోజుల సమయం పడుతుందన్నారు.