ఏపీ ఎన్నికలపై బీజేపీ ఛీప్ పురంధేశ్వరి కీలక ప్రకటన చేశారు. ఇవాళ మీడియాతో బీజేపీ ఛీప్ పురంధేశ్వరి మాట్లాడుతూ…బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామన్నారు. అందులో అంతర్భాగంగా గావ్ ఛలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న ఏడున్నర లక్షల పల్లెల్లో పర్యటిస్తామని తెలిపారు. త్వరలో వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నామన్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/01/n5788465961706630346804901a3b657c3e5ee42f462abaf7b830d0da0c00f22356ee68179397118cdd583c.jpg)
ఏపీలోని ప్రతి పల్లెను బీజేపీ కార్యకర్తలు సందర్శిస్తారని వివరించారు బీజేపీ ఛీప్ పురంధేశ్వరి. పల్లెకు పోదాంలో భాగంగా ఏపీలో ఉన్న 21 వేల గ్రామాల్లో పర్యటనలు ఉంటాయన్నారు బీజేపీ ఛీప్ పురంధేశ్వరి. ఇక అటు చంద్రబాబుతో బీజేపీ అధిష్టానం చర్చలు నిర్వహిస్తోంది. దీంతో చంద్రబాబుతో బీజేపీ పొత్తులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.