ఎన్నికలకి దగ్గర పడుతోంది సమయం. ఈ సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాథం పొలిటికల్ రీయంట్రీ పై అనేక ప్రచారాలు సాగుతున్నాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరతారని ఆయన కోడలికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆయనకి వైసిపి లోకి వెళ్లడం ఇష్టం లేదని తెలుస్తోంది టిడిపి లేదా జనసేన పార్టీలోకి వెళ్తారని ఆయన కొడుకే స్వయంగా చెప్పారు. ముద్రగడ్డతో టచ్ లోకి వెళ్లారు జనసేన టిడిపి నేతలు.
కిర్లంపూడి లోని మాజీమంత్రి ముద్రగడ నివాసంలో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని కలవడం జరిగింది. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్చార్జి బొల్లి శెట్టి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. కాపు జాతి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బొల్లి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన లోకి ముద్రగడని ఆహ్వానించాము అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఉద్దేశం తనకి లేదని ముద్రగడ చెప్పారని అన్నారు. ఉద్యమ నేతగా పవన్ కళ్యాణ్ అంటే గౌరవం ఉందని త్వరలో ఆయన్ని కలిసి మాట్లాడతానని చెప్పారని అన్నారు.