ఉపాధి కల్పించేలా డిగ్రీ కోర్సులు – ఏపీ విద్యాశాఖ ప్రకటన

-

ఉపాధి కల్పించేలా డిగ్రీ కోర్సులు అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్ధిని గ్లోబల్ స్టూడెంట్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నామని… విద్య కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామని వెల్లడించారు.

ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో దేశంలోనే ఏపీ ముందుందని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కి మంత్రివర్గంలో ఒక ప్రత్యేక పోర్ట్ ఫోలియో కూడా పెట్టామని.. అమ్మ ఒడి ద్వారా బడికి వెళ్లే ప్రతి పిల్లాడి చదువుకు డబ్బులు ఇస్తున్నామని వెల్లడించారు బొత్స.

ఉన్నత విద్యలో 87 శాతం మందికి పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పిస్తున్నామని..100 శాతం ఉచితంగా విద్యను అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం ఏపీనేనని తెలిపారు బొత్స.

 

Read more RELATED
Recommended to you

Latest news