ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయి. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత పదవీ దక్కింది.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బొత్స వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణను ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా ప్రకటించారు జగన్. ప్రజాసమస్యలపై పోరాటం చేయడానికి అసెంబ్లీ అయినా, మండలి అయినా తనకు ఒకటే అని తెలిసిన బొత్స.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తానన్నారు. మమ్మల్ని ఎదుర్కోవడానికి మహా అయితే కేసులు పెడతారని, అంతకంటే ఏం చేయలేరని, ప్రజల కోసం తాము ఎలాంటి కేసులయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే బొత్స సత్యనారాయణను మండలిలో ప్రతిపక్ష నేతగా ప్రకటించిన కొద్దిసేపటికే మండలి ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఆళ్ళ అప్పిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడం విశేషం.