ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంటర్, పదో తరగతి పరీక్షలకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. మార్చి నెలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు.
సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మార్చి 1 నుంచి మార్చి 15 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
మార్చి 18 నుంచి మార్చి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. 12 రోజుల పాటు పరీక్షల షెడ్యూల్ ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 నిమిషాలకు వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.