బొత్సకు పురంధేశ్వరి కౌంటర్‌..పచ్చకామెంర్లు అంటూ !

-

బొత్స సత్యనారాయణ కామెంట్స్ కు బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఘాటు కౌంటర్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యల పై మండి పడ్డారు పురంధేశ్వరి. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.

botsa satyanarayana vs purandeswari

అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని… బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. విశాఖ రైల్వే జోన్ కు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదని ఫైర్‌ అయయారు. వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్ కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకో లేకపోయారన్నారు బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. పసలేని ఆరోపణలు చేయడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించుకోవాలని చురకలు అంటించారు బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news