తమిళిసైపై ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

-

మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్పై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రొ.ఎం.శ్రీనివాస్‌రెడ్డి బుధవారం రోజున ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కాలనీలో ప్రచారం చేస్తూ ఓటర్లకు అయోధ్య రామమందిర నమూనాలు పంపిణీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్య ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. కిషన్‌ రెడ్డిని అనర్హులుగా ప్రకటించి తమిళిసై ప్రచారం చేయకుండా డీబార్‌ చేయాలని ఈసీని కోరినట్లు తెలిపారు.

అయితే తమిళిసై తమ కుటుంబ సన్నిహితురాలని, మంగళవారం ఇంటికి వస్తే తెలిసిన వారికి మందిర నమూనాలు బహుమతిగా ఇచ్చామని బీజేపీ నాయకురాలు పాదూరి కరుణ వెల్లడించారు. కిషన్‌ రెడ్డికి ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఈసీ స్పందించాల్సి ఉంది. తమిళిసై సికింద్రాబాద్ లోక్సభ ఇంఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీకి మరో ఛాన్స్ ఇస్తే భారత్ను ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా మోదీ మలుస్తారంటూ తమిళిసై ఓటర్లకు వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news