పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడికి, ఎందుకు పారిపోయాడు – మాచర్ల టిడిపి అభ్యర్థి జూలకంటి

-

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడికి, ఎందుకు పారిపోయాడని మాచర్ల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఫైర్‌ అయ్యారు. మాచర్ల ప్రాంతం లో జరిగిన ఘటనలు ,అవినీతి పై సిట్టింగ్ జడ్జితో విచారణ కు మేము సిద్ధం గా ఉన్నాం, పిన్నెల్లి సోదరులు సిద్ధమేనా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర ఉండి ఈవిఎం లు ధ్వంసం చేయించాడని ఆగ్రహించారు. తాలిబన్ ముఠా లా గా మొహాలకు ముసుగులు ధరించి విధ్వంసం చేశారు…నువ్వు భయపెడితే భయపడే వాడు ఎవరు లేరన్నారు.

Brahma Reddy slams pinnelli

పోలీసు ఆదేశాలు బేఖాతరు చేస్తూ అర్థరాత్రి పరారయ్యాడు…పిన్నెల్లి కి చట్టాన్ని గౌరవించడం రాదని మండిపడ్డారు. కారంపూడి, రెంటాల్ల ప్రాంతాల్లో పిన్నెల్లి వెంకట రామి రెడ్డి, వాహనాల్లో తిరుగుతూ సినీ ఫక్కీలో కర్రలు,రాళ్ల తో దాడులు చేపించాడు..పిన్నెల్లి సోదరులకు ప్రజాస్వామ్య విలువలు తెలియవని ఆగ్రహించారు. పరామర్శకు వెళ్ళే వాళ్ళు ఆయుధాలు తీసుకుపోతారా? ….అందుకే మాచర్ల లో తాలిబన్ ప్రభుత్వం పాలిస్తుందన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు….మాచర్ల నీ తాత జాగీరు కాదని హెచ్చరించారు. పోలీసు అధికారులు చూస్తుండగానే నాపై కారం చల్లారు…పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు పారిపోయాడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నువ్వు ఏ తప్పూ చేయక పోతే, ఏ భయం నిన్ను వెంటాడుతుందో చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version