జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర వాయిదా పడింది. అక్టోబరులో యాత్ర ఉంటుందని గతంలో ప్రకటించిన విధంగానే జనసేన యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి నియోజకవర్గాలవారీగా సమీక్షలు ఉంటాయని తెలిపారు జనసేన అధినేత.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 సీట్లే రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనవాణీలో వచ్చిన అర్జీలను కూడా పరిశీలిస్తున్నామని.. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ఆనాడు ఒప్పుకొని ఇప్పుడు 3 రాజధానులు అంటారా. గతంలో రాజధానికి ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదని చెప్పాను. జనసేన ఎమ్మెల్యేలు 10 మంది ఉంటే గట్టిగా పోరాడేవాళ్లమన్నారు పవన్ కల్యాణ్.
2014లో టీడీపీని నేను గుడ్డిగా సపోర్ట్ చేయలేదని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ పార్టీనేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. మీడియాతో మాట్లాడుతూ.. 2009లో చేసిన తప్పును సరిదిద్దేందుకే 2014లో టీడీపీకి మద్దతిచ్చాను.. గత ప్రభుత్వంలో ఉత్పన్నమైన సమస్యలపై స్పందించానని వెల్లడించారు.చిన్న సైజు రాజధాని పెట్టమని గత ప్రభుత్వ హయాంలోనే నేను చెప్పాను…. ఆనాడు వైసీపీ నేతలే నన్ను విమర్శించారని ఆగ్రహించారు. చట్ట సభల్లో రాజధానికి వైసీపీ మద్దతిచ్చింది…. చట్టసభల్లో రాజధాని విషయంలో గతంలో వైసీపీ ఇచ్చిన మాటను తప్పిందని ఫైర్ అయ్యారు.