కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా బ్రూవరీ లైసెన్సులు ఇచ్చేది లేదని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ అధికారులు వాటిని లెక్కపెట్టడం లేదు. అయితే కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తు ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్నారు.మనల్ని ఎవరు అడిగేది అనే తరహాలో అక్రమ నిర్మణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ అధికారులు యథేచ్ఛగా అనుమతులు ఇచ్చేస్తున్నారు.దీనిపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నా అసలు పట్టించుకోవడం లేదు.
విజయవాడలో బ్రూవరీ లైసెన్స్ మంజూరుకు సంబంధించి ఒకటి బయటపడింది.బందరు రోడ్డులో D మాల్ పేరుతో ఓ నిర్మాణం రన్నింగ్ లో ఉంది. విజయవాడ మునిసిపల్ అధికారులు జనవరి 6వ తేదీన దీనికి అనుమతులు ఇచ్చేశారు.ఈ మాల్ అనుమతుల్లో నియమాలు విస్మరించబడ్డాయి.ఇంతకుముందు అధికారులు క్షేత్రస్థాయిలో తనికీలు నిర్వహించాకే ట్రేడ్ లైసెన్సులు ఇచ్చేవారు.అయితే ప్రజాభద్రతకు తిలోదకాలిచ్చిన అధికారులు స్వలాభం చూసుకుంటూ లైసెన్స్ లు ఇచ్చేస్తున్నారు అనేందుకు ఇదే ఉదాహరణ.ఇందులో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే…. ప్రభుత్వ ఆసుపత్రికి 20 అడుగుల దూరంలోనే ఈ డిస్టిల్లరీస్ ఏర్పాటు అవుతోంది.అంటే ప్రజల భద్రత, శ్రేయస్సుకి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వడంలేదని అర్థమవుతోంది.
అక్రమాలకు విరుద్ధంగా ఉందనే ప్రజావేదికను కూల్చివేసిన ఘనత సీఎం జగన్ కే సొంతం.అలాంటి సంక్షేమ పాలనలో ఇలాంటీ సంఘటనలు చోటుచేసుకోవడం విస్తుగొలుపుతోంది. మైక్రోబ్రూవరీలకు సంబంధించి మరో పది దరఖాస్తులు వెయిటింగ్ లో ఉన్నాయి. బార్ లైసెన్సుల కోసం వందల మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారు.ఇందులో కడప జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారు. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ డిస్టిల్లరీస్ అనుమతుల విషయంలో సీఎం చాలా కఠీనంగా ఉంటున్నారు. కొత్త లైసెన్సులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో కొందరు కోర్టుకి కూడా వెళ్లారు. అయినప్పటికీ సీఎం వైఖరిలో మార్పు రాలేదు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ అంశంమైనా అనుమతించబోమని తేల్చి చెప్పసారు.ఇలాంటి నిర్మాణాలు నిర్మానుష్య ప్రాంతాల్లో చేయాలి.అయితే నడి నగరంలో అక్రమ నిర్మాణం చేపట్టడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఈ అక్రమ కట్టడాలపై వెంటనే స్పందించాలని డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని కోరుతున్నారు. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ప్రజల అవసరాలకు, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ పబ్లిక్ నుంచి వినిపిస్తోంది.