ఈడీ అధికారులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేఖ

-

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ప్రముఖ తెలుగు హీరో మహేష్ బాబు లేఖ రాశారు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. తనకు మరో డేట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న #SSMB29 సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో తనకు మరో అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. 

ఈ కంపెనీ ప్రమోషన్ కోసం మహేష్ బాబు రూ.5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ పాల్పడిన ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారని.. ఆ ప్రమోషన్ల పేరుతో భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే ఈ నెల 22న మహేష్ బాబుకి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసుల ప్రకారం.. సోమవారం ఉదయం 10.30 గంటలకు బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి మహేష్ బాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news