ఆల్ ఇండియా పిరికిపందల సంఘానికి కొడాలి నాని అధ్యక్షుడు అంటూ బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో టిడిపి నాయకులు వీరోచితంగా పోరాడారని… ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయ్యేందుకు ప్రాకులాడే వాడు వంశీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనవసరంగా నోరు పారేసుకున్నారని… ముఖ్యమంత్రి చంద్రబాబు పై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసిన వారిని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.
కొడాలి,వంశీని జైలుకు పంపాలి ఇదే టిడిపి కార్యకర్తల అభీష్టం అన్నారు. తొడలు కొట్టిన కొడాలినాని,వంశీ మీ అడ్రస్ ఎక్కడ అంటూ నిలదీశారు. పదవుల్లో ఉన్నపుడు పిచ్చి కుక్కల్లా వాగారని బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్ చేశారు. ఇపుడేమో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో లాలూచీ పడ్డట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. పోసాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడి నేను ఇంక రాజకీయాలు మాట్లాడను అంటున్నారు…. క్షమాపణలు అర్హులు కారని నిప్పులు చెరిగారు. దేవినేని అవినాష్ పార్టీ కార్యాలయంపై దాడి చేయించారని ఆరోపణలు చేశారు బుద్దా వెంకన్న. చంద్రబాబు,భువనేశ్వరి కాలి ధూళి కూడా అర్హులు కారని.. వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు.