హైదరాబాద్లో అర్ధరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో పట్టు బడ్డ ఓ తాగుబోతు నడిరోడ్డుపై నానా రభస చేశాడు.పాతబస్తీలోని చంపాపేట్ చౌరస్తాలో ఎంఐఆర్ చౌక్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ అమరేందర్ రెడ్డి తనిఖీలు నిర్వహిస్తుండగా.. మద్యం సేవించిన ఓ వ్యక్తి అటుగా వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. అతని తనిఖీలు చేస్తుండగా.. వాహనానికి నెంబర్ ప్లేట్లు గానీ, ఎటువంటి డాక్యుమెంట్స్ గానీ లేవు.
దీంతో పోలీసులు ఆ వాహానాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో నడి రోడ్డు పైనే ఆ తాగుబోతు వీరంగం సృష్టించాడు. నేను ఏం తప్పు చేయనప్పుడు నా బండి ఎందుకు తీసుకెళ్తున్నారని వాగ్వాదానికి దిగాడు. పక్కనే ఉన్న ఇటుక రాయి తీసుకొని పోలీసుల మీదకు విసిరాడు. చివరికి ఆ ట్రాఫిక్ అధికారి కాళ్లు పట్టుకోడానికి ప్రయత్నించాడు. అనంతరం ట్రాఫిక్ విభాగం వారు అతన్ని పోలీసులకు అప్పజెప్పి వాహనాన్ని సీజ్ చేశారు.