ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినేట్ సమావేశానికి ముహుర్తం ఫిక్స్ అయింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఆర్‌డీఏ ఆమోదించిన 23 అంశాలకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినేట్ సమావేశంలో కాకినాడ పోర్ట్ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అటు పలు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డీపీఆర్‌లపై చర్చించనుందట ఏపీ కేబినెట్. ముఖ్యంగా సోషల్ మీడియా వేధింపుల కేసులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరుగనుంది.
- ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం…
- 11 గంటలకు ఏపీ సచివాలయంలో సమావేశం కానున్న ఏపీ కేబినెట్
- ఏపీ సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
- కాకినాడ పోర్టు అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
- సోషల్ మీడియా వేదికగా వేధింపులపై కేసులు, వాటి ప్రస్తుత భవిష్యత్తు కార్యాచరణ పై కేబినెట్ చర్చించే అవకాశం
- ప్రధానంగా పలు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డీపీఆర్ ల పై చర్చించనున్న కేబినెట్