Cancellation of Land Titling Act in AP: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానుందట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం హోదాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన సంతకం చేయాలని నిర్ణయించుకున్నారట చంద్రబాబు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం హోదాలో ఈ చట్టం రద్దు పైనే సంతకం చేయనున్నారు.
ఇందుకు అవసరమైన ఏర్పాట్లు రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. మంత్రివర్గ సమావేశం ఆమోదం అనంతరం శాసనసభలో చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టరున్నారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి రాగానే దీనిని రద్దు చేస్తామని టిడిపి ప్రకటించింది. ఈ నెల 17 నుండి నాలుగు రోజులు జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టనునట్లు సమాచారం అందుతోంది. కాగా… ఈ నెల 17 నుండి నాలుగు రోజులు పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి.