కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏకాదశి కావడంతో ఆరోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. నాలుగు రోజులపాటు కొనసాగే మొదటి సెషన్ లో తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండవ రోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది.
ఇక అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం హోదాలో ఈ చట్టం రద్దు పైనే సంతకం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. మంత్రివర్గ సమావేశం ఆమోదం అనంతరం శాసనసభలో చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టరున్నారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి రాగానే దీనిని రద్దు చేస్తామని టిడిపి ప్రకటించింది.