టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదుతగిలింది. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఐంది.

టీటీడీ పాలక మండలి సభ్యుడి ఫిర్యాదుతో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. కాగా తిరుపతిలో నిన్న హైటెన్షన్..నెలకొంది. టీటీడీ గోశాల అంశంలో టీడీపీ, వైసీపీ పరస్పర సవాళ్లు కొనసాగుతున్నాయి. కచ్చితంగా గోశాలకు నిన్న వస్తానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
ఇక కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు. గోశాలకు వెళ్లకుండా భూమన కరుణాకర్ రెడ్డిను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇలా పోలీసుల ద్వారా అడ్డుకోవడం అయితే చేతకాని సవాళ్లు చేయడం ఎందుకు ? అంటూ ఫైర్ అయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి.