ప్రొబేషన్‌ పీరియడ్‌లో మాతృత్వ సెలవు.. చంద్రబాబు కీలక నిర్ణయం

-

సీఎం చంద్రబాబునాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొబేషన్‌ పీరియడ్‌లో మాతృత్వ సెలవును డ్యూటీగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ప్రొబేషన్‌ పీరియడ్‌లో మాత్రమే డ్యూటీ వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రకటన చేసింది సర్కార్.

AP government orders considering maternity leave as duty during probation period

ఇక అటు గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..చెప్పింది. నెలకు రూ.5 వేలు చొప్పున పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చే అందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ది చేకూరనుంది. 2024 మే నుంచి నవంబర్ వరకు (7 నెలలు) విడుదల కానున్నాయి. నారా లోకేశ్ యువగళం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో హర్షం వ్యక్తం చేస్తున్నారు పాస్టర్లు.

 

Read more RELATED
Recommended to you

Latest news