కులాల లెక్కలు..ఎవరికి ఎడ్జ్?

-

ఏపీలో కుల రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. ఎప్పుడు ఏపీలో కులాల మీద ఆధారపడే రాజకీయం నడుస్తోంది. కాకపోతే ఎన్నికల ముందు మరింత ఎక్కువగా కుల రాజకీయం జరుగుతుంది. కానీ ఎప్పుడు ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే..కుల రాజకీయం మొదలైపోయింది. వాస్తవానికి ఈ కుల రాజకీయాలు చేసి..లబ్ది పొందడంలో వైసీపీ ముందుంది. గత ఎన్నికల్లో ఎలా లబ్ది పొందిందో అందరికీ తెలిసిందే.

టీడీపీ తేరుకునే లోపే..వైసీపీ ఊహించని విధంగా కులలతో రాజకీయం నడిపి..ప్లస్ చేసుకుంటుంది. ఇప్పుడు కూడా అదే తరహాలో వైసీపీ ముందుకొస్తుంది..వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సత్తా చాటాలనే క్రమంలో..రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ, ఎస్సీ, కాపు ఓటర్లు లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. వైసీపీలో ఏ కులం నేతల చేత..ఆ కులం పేరిట రాజకీయం నడిపిస్తున్నారు. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు..ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేస్తూ..ఎస్సీలకు జగనే మేలు చేశారని, చంద్రబాబు ఏమి చేయలేదని చెప్పి..టీడీపీకి ఎస్సీ ఓట్లని దూరం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఇటీవల వైసీపీ బీసీ నేతలు..బీసీలు టీడీపీ వైపుకు వెళ్లకుండా, మళ్ళీ జగన్‌కు మద్ధతు తెలిపేలా రాజకీయం చేస్తున్నారు. సెపరేట్ గా సమావేశాలు, సభలు పెట్టడం, బాబుని విమర్శించడం, జగన్ బీసీలకు చాలా చేశారని ప్రచారం చేయడం చేస్తున్నారు. ఇక బాబుతో పవన్ కలుస్తున్నా నేపథ్యంలో వైసీపీలో ఉన్న కాపు నేతలు..కాపులని టీడీపీ-జనసేనల వైపుకు వెళ్లకుండా చేయడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు.

ఇక వైసీపీకి కౌంటరుగా టీడీపీ సైతం కులాల ఆధారంగా రాజకీయం మొదలుపెట్టారు. అటు జనసేన సైతం కాపులని వైసీపీ వెళ్లకుండా చూసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. బీసీ, ఎస్సీ, కాపు ఓటర్లే మెయిన్ టార్గెట్ అయ్యారు. అయితే గత ఎన్నికల్లో ఈ మూడు వర్గాలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకి మద్ధతు ఇచ్చారు. ఈ సారి సీన్ మారేలా ఉంది. కుల రాజకీయం ఈ సారి వైసీపీకి వర్కౌట్ అయ్యేలా లేదు. గతంతో పోలిస్తే ఎస్సీల మద్ధతు వైసీపీకి దక్కే ఛాన్స్ ఉంది..కాకపోతే మెజారిటీ వైసీపీ వైపే ఉంటారు. బీసీలు…టీడీపీ-వైసీపీలకు ఫిఫ్టీ-ఫిఫ్టీ అయ్యేలా ఉన్నారు. కాపులు మాత్రం టీడీపీ-జనసేనలకే మెజారిటీ సంఖ్యలో మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉంది.

ReplyForward

Read more RELATED
Recommended to you

Exit mobile version