బీజేపీ ఎమ్మెల్యేకు వాట్సాప్​లో న్యూడ్ వీడియో​ కాల్​..!

-

హనీ ట్రాప్ చేసి భారీగా నగదు కాజేసే సంఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కేవలం సాధారణ పౌరులకే కాదు హనీ ట్రాప్ సమస్య ఇప్పుడు ప్రముఖులకూ తప్పడం లేదు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే తనను ఓ మహిళ హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు.

“కర్ణాటక ఎమ్మెల్యే తిప్పారెడ్డికి అక్టోబర్​ 31న గుర్తుతెలియని నంబర్​ నుంచి ఓ వాయిస్ ​కాల్​ వచ్చింది. దానికి స్పందించిన ఆయనకు వెంటనే.. అదే నంబర్​ నుంచి వాట్సాప్​లో వీడియోకాల్​ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని కూడా ఆన్సర్ చేయగా.. వీడియోలో ఉన్న మహిళను చూసి ఒక్కసారిగా షాక్​కు గురైయ్యారు. కాల్​లో ఉన్న మహిళ హిందీలో మాట్లాడుతూ.. నగ్నంగా ఉంది. వెంటనే ఎమ్మెల్యే ఆ కాల్​ను కట్​ చేశారు. అయితే.. కాల్​ కట్​ అయిన తర్వాత ఆ నంబర్ నుంచి ఆయనకు కొన్ని పోర్న్​ వీడియోస్​ వచ్చాయి.” అని ఎమ్మెల్యే తిప్పారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చిత్రదుర్గం పోలీసులు తెలిపారు.

‘పోర్న్ వీడియోస్ వచ్చిన వెంటనే ఆ నంబర్ బ్లాక్ చేసి నేను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వారు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.’ అని ఎమ్మెల్యే తిప్పారెడ్డి తెలిపారు. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులే ఈ హనీట్రాప్​కు ప్రయత్నించి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version