అవినాష్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో సీబీఐ కౌంటర్

-

వివేకా హత్య కేసులో దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారని సీబీఐ పేర్కొంది. అవినాష్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇటీవల హైకోర్టులో సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. సీబీఐ కౌంటరులో వివేకా హత్య దర్యాప్తుపై కీలక వివరాలు వెల్లడించింది.

‘‘అవినాష్‌రెడ్డి దురుద్దేశ పూరితంగానే దర్యాప్తునకు సహకరించట్లేదు. సమాధానాలు దాట వేశారు, వాస్తవాలు చెప్పలేదు. అవినాష్‌ను అరెస్టు చేసి కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు. ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ముందుకు రావట్లేదు. అతని అనుచరుల వల్ల దర్యాప్తునకు ఆటంకం కలిగింది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాలు చెరిపేయడంలో అవినాష్ ప్రమేయం ఉంది. హత్యాస్థలిలో ఆధారాలు చెరిపేయడం కుట్రలో భాగమే .నేరాన్ని తనపై వేసుకుంటే రూ.10కోట్లు ఇస్తామన్నారని గంగాధర్‌రెడ్డి అన్నారు. గంగాధర్‌రెడ్డి వాంగ్మూలంలో వాస్తవం తేలాలి.” అని సీబీఐ దాఖలు చేసిన కౌంటర్​లో వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news