ఏపీలో దివ్య కళ మేళ ప్రారంభించిన కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్..!

-

ఆంధ్ర యూనివర్సిటీ మెరీనా గ్రౌండ్స్ లో దివ్య కళ మేళ ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ నజీర్, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. దివ్య కళ మేళకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. 100 రకాల చేతి వృత్తులు ఉపాధి కల్పనకు భాగంగా కేంద్రం ప్రోత్సహిస్తున్నది. సామాన్య జీవితం కు ప్రోత్సాహం చాలా అవసరం. అటువంటి దివ్యంగులకు మరింత సహకారం అవసరం. చేతి వృత్తులు ను, కళలు కు కావల్సిన ముడిసరుకులు అందిస్తాం.

సామాన్య ప్రజలు తో పాటు దివ్యంగుల జీవితం ఎదగాలని అన్నది ప్రభుత్వం కోరిక. దీవ్యంగులకు కావాల్సిన అన్ని సహాయ సాకారాలు కల్పిస్తాం, ప్రత్యేకమైన రిజర్వేషన్ కలిపిస్తున్నం. వారి ఆత్మ విశ్వాసం పెరిగేలా అన్ని దశలు లో బాల్యం, విద్య, ఉపాధి లో ప్రభుత్వం తోడు గా ఉంటుంది. ఆర్ధికంగా ఎదగటానికి సామాజిక న్యాయం చేస్తూ మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దేశ ఖ్యాతి పెరగటానికి యువత తో పాటు దివ్యంగులు ఉంటారని 2047 నాటి కి దేశం లో పేదరికం ఉండదు అని మంత్రి వీరేంద్ర కుమార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version