BRS లీడర్లు అయిన కేటీఆర్, హరీష్ రావు పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయిన బాధలో హరీష్ రావు, కేటీఆర్ అవగాహన కోల్పోయి మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు రఘునందన్ రావు. పదేళ్లలో ఏమి చేయలేని అసమర్థులు.. కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని అన్ని చేయాలంటున్నారు అని పేర్కొన్నారు.
బంగారు తెలంగాణ అయిపోయిందని వందల కోట్లు పెట్టి సెక్రటేరియట్ వంటి భవనాలు కట్టారు. మరి BRS హయాంలో ఆస్పత్రులను ఎందుకు బాగా చేయలేదు అని ప్రశ్నించిన ఆయన.. 2014 నుండి ఏ ఆస్పత్రిలో ఎంతమంది చనిపోయారో లెక్కలు తీయాలి అని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు BRS అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందు దౌల్తాబాద్ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. BRS అధికారంలో ఉన్నపుడు ఇలాంటివి చాలా జరిగాయి అని పేర్కొన రఘునందన్ రావు.. అలా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం లేదు అని తెలిపారు.