ఏపీకి మరో షాక్‌..పోలవరం నిధులపై కేంద్రం కీలక ప్రకటన !

-

ఏపీకి మరో షాక్‌..పోలవరం నిధులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం నిర్మాణంలో భాగంగా నిర్మించనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రూ. 5,338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2026 జనవరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఏపీ జన్ కో ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వెల్లడించారు.

ఈ మేరకు రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అడిగిన ప్రశ్నకు గజేంద్ర సింగ్ షేకావత్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పవర్ జన రేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యం లో హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఏపీ జెన్ కో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు పవర్ హౌస్ పునాది నిర్మాణం కోసం తవ్వకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టు పూర్తిగా ఏపీ ప్రభుత్వం సొంత నిధులతోనే అమలు చేస్తారని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news