ఏపీలో మార్కెట్ కమిటీలకు చైర్మన్ల ప్రకటన

-

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పడవుల పండగ వచ్చేసింది. 30 మందికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి వారి గెలుపులో కీలకంగా పని చేసిన వారికి సువర్ణ అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన కూటమి తాజాగా 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్ పదవులను భర్తీ చేశారు.

తెలుగుదేశం నుంచి 25 మందికి, జనసేన నుంచి నలుగురికి, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. అభ్యర్థుల ఎంపికపై మూడు పార్టీల అధినాయకులు చర్చించి ఈ నిర్ణయ తీసుకున్నారు. 30 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. మిగిలిన పదవులకు సైతం అభ్యర్థులను త్వరలోనే ఎంపిక చేసి లిస్టు రిలీజ్ చేస్తామని కూటమి వర్గాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news