ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గ్రూపు లపై సంచలన ప్రకటన చేసింది. తమ క్లస్టర్ పరిధిలో గ్రామ అలాగే వార్డు వాలంటీర్లు క్రియేట్ చేసిన వాట్సాప్ అలాge టెలిగ్రామ్ గ్రూపులను వెంటనే తొలగించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ గ్రూపుల నుంచి వైదొలగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చంద్రబాబు సర్కార్ కీలక సూచనలు చేసింది.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఆ గ్రూపులో పెట్టినట్లు తమ దృష్టికి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది చంద్రబాబు సర్కార్. తొలగించిన వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూపుల వివరాలను ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోపు తమకు తెలియజేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.