చంద్రబాబుకు “యావజ్జీవం” తప్పదు ?

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు యావజ్జీవ జైలు శిక్ష తప్పదా? అయితే వైసీపీ మాత్రం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు యావజ్జీవ జైలు శిక్ష తప్పదని జోరుగా ప్రచారం చేస్తోంది. ఏ లెక్కన చూసినా శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని… స్కిల్, ఫైబర్‌నెట్, అసైన్డ్‌ భూములు, ఐఆర్‌ఆర్, లిక్కర్, ఇసుక స్కాంలు చంద్రబాబు చుట్టుముట్టాయని పోస్ట్లు పెడుతున్నారు. అన్ని కుంభకోణాల ప్రధాన కుట్రదారు, లబ్ధిదారు ఆయనే ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు.

TDP chief Chandrababu’s visit to Kuppam on 28th of this month

సెక్షన్‌ 409 కింద ఒక్కో కేసులో యావజ్జీవ ఖైదుకు అవకాశం ఉంటుందట. అవినీతి నిరోధక చట్టం కింద ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు పడే ఛాన్స్ ఉందట. బాబు అవినీతికి వ్యతిరేకంగా ఆధారాలు లేవని కోర్టు చెప్పలేదని పేర్కొంటోంది వైసీపీ. అయినా ముందస్తు బెయిల్‌ను ఎల్లో మీడియా వక్రీకరిస్తోందని చెబుతున్నారు వైసీపీ నేతలు. నాడు అధికార దుర్వినియోగం.. యథేచ్ఛగా ప్రజాధనం దోపిడీ చేసాడని.. సీఐడీ దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయని పేర్కొంటున్నారు. డాక్యుమెంటరీ ఆధారాలు.. కీలక సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని జోరుగా ప్రచారం చేస్తోంది వైసీపీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version