వై నాట్ పులివెందుల…పులివెందులలో టిడిపి జెండా ఎగరాలి – చంద్రబాబు

-

వై నాట్ పులివెందుల…పులివెందులలో టిడిపి జెండా ఎగరాలని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. నిన్న పులివెందులలో చంద్రబాబు పర్యటించి మాట్లాడారు. వ్తె నాట్ పులివెందుల… బిటెక్ రవికి అందరికీ తోడుగా నిలబడ్డాలని కోరారు చంద్రబాబు. సమయం వస్తే కొదమసింహాంలా తిరుగుబడుతానని… పులివెందులలో టిడిపి జెండా ఎగరాలన్నారు.

బాబాయిపై గొడ్డలి వేటు వేశారని.. పులివెందల పులిబిడ్డ సునీత న్యాయం కోసం పోరాడుతోందని వెల్లడించారు. కడప ఎంపీ…. కమలాహాసన్ ను మించిపోయాడు… బాబాయిని చంపిన వ్యక్తిని దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహించారు. పాపం షర్మిలా…. ఎన్నికల ముందు ఊరూరు తిప్పాడని ఫైర్‌ అయ్యాడు చంద్రబాబు. ఎంపీ లేదు … ఆస్తి లేదు..ఆస్తిలో సమానహక్కు కూడా షర్మిలకు వచ్చే పరిస్థితి లేదన్నారు. పులివెందుల ఆడబిడ్డకు అన్యాయం జరిగింది… న్యాయం వ్తెపు పులివెందుల ప్రజలు నిలబడాలని కోరారు. చంపాడానికి వచ్చే వాడు కోడికత్తి తీసుకువచ్చి దాడి చేస్తాడా…ఎన్నికలలో లబ్ధికోసం కోడి కత్తి డ్రామా చేశాడని జగన్‌ పై విరుచుకుపడ్డారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news