తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” లో ఉత్తమ్ కు చోటు

-

తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఉత్తమ్ కుమార్‌ రెడ్డికి చోటు దక్కింది. గాంధీ కుటుంబం చొరవతోనే ఉత్తమ్ కుమార్‌ రెడ్డికి కమిటీ లో చోటు దక్కిందని సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో, లోకసభ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఏలాంటి పొరపాటు జరగరాదన్నదే కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం ఆలోచనలో ఉంది.

ఇందులో భాగంగానే ఆచితూచి “స్క్రీనింగ్ కమిటీ” ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షుడు గా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఫార్సులను, అభిప్రాయాలను కూడా పరిగణన లోకి తీసుకోవాలన్నదే గాంధీ కుటుంబం ఉద్దేశం అని తెలుస్తోంది. ఈ కమిటీ లో ఉత్తమ్ కు చోటు కల్పించడం ద్వారా టికెట్ల విషయంలో “కాంగ్రెస్ కార్యకర్తలు” కు భరోసా ఇచ్చింది పార్టీ అధినాయకత్వం. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు కమిటీలో ఉండడం అసాధారణం. ఇక ఎక్స్ అఫీషియో సభ్యులు గా తెలంగాణ ఏఐసిసి ఇంచార్జి థాక్రే, ముగ్గురు ఇంచార్జ్ సెక్రటరీ లు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నాయకుడు భట్టి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news