సీఎం జగన్ ప్రజా ద్రోహి..అంబటి పెద్ద అంబోతు అంటూ ఫైర్ అయ్యారు నారా చంద్రబాబు. జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పడకేశాయని.. ఏపీలోని 69 నదులను అనుసంధానం చేయడం ముఖ్యమన్నారు చంద్రబాబు. ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తైతే.. నీటి సమస్యే ఉండదని.. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రధాన నదులు.. వీటి కింద అనేక నదులు ఉన్నాయని చెప్పారు.
ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామన్నారు. వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేయొచ్చు.. కానీ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని నిప్పులు చెరిగారు చంద్రబాబు. నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని.. ప్రాజెక్టులపై సీఎస్ హడావుడి సమీక్ష పెట్టారన్నారు. సీఎం జగన్, మంత్రి లేకుండానే ప్రాజెక్టులపై సమీక్షించారని చురకలు అంటించారు. ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కానీ.. అంబోతులా అరుస్తాడు తప్ప ఏం చేయడు..? అంటూ ఫైర్అయ్యారు చంద్రబాబు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చొపెట్టినట్టే ఉందని ఆగ్రహించారు.