చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేటి అందుబాటులోకి GoIR వెబ్ సైట్ వచ్చింది. కాసేపటి క్రితం నుంచే అందుబాటులోకి వచ్చింది జీవోఐఆర్ వెబ్ సైట్. ప్రభుత్వ సమాచారం ప్రజలకు అందుబాటులోకి లేకుండా రహస్యంగా జీవోలు జారీ చేసింది గత ప్రభుత్వం. అయితే… జీవోఐఆర్ వెబ్ సైట్ మూసేసి రహస్యంగా జీవోలు జారీ చేసిందట జగన్ సర్కార్.
ఇక ప్రభుత్వ సమాచారంలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదనే పాలసీకి కట్టుబడింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వస్తే జీవోలను ఓపెన్ గా పెడతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ఇవాళ్టీ నుంచి అందుబాటులోకి వచ్చింది జీవోఐఆర్ వెబ్ సైట్. ప్రజలంతా జీవోలు చూసుకునేలా పబ్లిక్ డొమైనులో అందుబాటులోకి వచ్చిందన్న మాట. ఈ మేరకు జలవనరుల శాఖ ద్వారా మొదటి జీవో జారీ చేసింది ప్రభుత్వం.