గృహ నిర్మాణం పేరిట కేెంద్ర నిధుల దుర్వినియోగం..!

-

గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు అధికారులు. నిధుల దుర్వినియోగం, పక్కదారి పట్టిన నిధుల విషయమై లెక్కలు తీస్తోన్న గృహ నిర్మాణ శాఖ అధికారులు… వేల కోట్ల మేర గృహ నిర్మాణ నిధుల్లో అక్రమాలు.. దారి మళ్లింపు జరిగిందని గుర్తించారు. కేంద్ర నిధుల్లో అవకతవకలు జరిగినట్టు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. గృహ నిర్మాణం కోసం ఇచ్చిన కేెంద్ర నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు.

గృహ నిర్మాణ శాఖలో సుమారు రూ. 3183 కోట్ల మేర కేంద్ర నిధుల దుర్వినియోగమైనట్టు లెక్కలేసారు అధికారులు. కేంద్ర స్కీంకు రూ. 1575 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఇళ్ల నిర్మాణ పథకాన్ని గందరగోళంలోకి నెట్టేసింది గత ప్రభుత్వం. నిర్మించిన ఇళ్ల లెక్కలకి గత ప్రభుత్వం తప్పుడు వివరాలు ఇచ్చినట్టు గుర్తించారు. 1,32,757 మేర ఇళ్లను నిర్మించకున్నా.. లెక్కల్లో చూపించి మభ్య పెట్టిందని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version