టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 34 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇక నిన్న చంద్రబాబును జైలు అధికారులు హాస్పిటల్ కు తరలించారు. చంద్రబాబుకు ఈ వాతావరణానికి తట్టుకోలేక అధిక ఎండా వేడిమి మరియు ఉక్కపోత కారణంగా అలర్జీ వచ్చిందట.
ఈ విషయాన్ని చంద్రబాబు అధికారులకు తెలియచేయగా వెంటనే స్పందించిన జైలు అధికారులు రాజమండ్రి లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినా వైద్యులకు సమాచారం ఇవ్వగా, వెంటనే వారి జైలుకు వచ్చి పరీక్షిస్తున్నారు.ఇక తాజాగా చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జీజీహెచ్ చర్మవ్యాధి నిపుణులు చంద్రబాబును పరీక్షించారని జైలు అధికారులు తెలిపారు. చర్మ సమస్యలను డాక్టర్లకు చంద్రబాబు తెలిపారట. ఇక చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉంది అన్నారు వైద్యులు.