తిరుమల నుంచే ప్రక్షాళన ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు. ‘గత ప్రభుత్వంలో తిరుమలలో అవినీతి జరిగింది. పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తాను.
మంచి వాళ్లను రక్షిస్తూ చెడ్డవారిని శిక్షించాలని దేవుడే చెప్పారు. నేటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. ఏపీ నంబర్ 1గా ఉండాలి. తెలంగాణ బాగుండాలి. నేను అందరివాడిని’ అని వ్యాఖ్యానించారు.
తిరుమలలో అన్నదానం తీసుకొచ్చింది ఎన్టీఆరే. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉండాలి. భారతీయుల్లో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి. భారతీయులు ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉంటే అందులో 30 శాతం తెలుగువారుండాలి. సంపద సృష్టించాలన్నారు.